మహిమాన్వితం.. మహాప్రసాదం
బ్రహ్మంగారిమఠం : ‘జగన్మాతా.. దీవించు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. మహాదేవి ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ప్రసాదం.. మహిమాన్వితం’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహించిన ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. అమ్మవారికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం మహాప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం, శ్రీఈశ్వరీదేవి మఠం సంప్రదాయాల ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ద్వార పూజ చేశారు. బ్రహ్మంగారిమఠంలో ప్రసాదం తయారు చేసి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి, సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి, ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఈశ్వరీదేవి
ఆరాధన మహోత్సవాలు


