తప్పుడు రికార్డులతో పరిహారం కాజేశారు
మా గ్రామ పొలం సర్వే నంబరు 102లో నాకు 52 సెంట్ల భూమి యురేనియం కార్పొరేషన్ సేకరించింది. సర్వే నంబరు 742లో రెండు ఎకరాల 85 సెంట్ల భూమి నా పేరిట ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు మాయాజాలం చేసి సదరు రెండు సర్వే నంబర్లలోని భూమిని కొప్పుల వెంకటేశ్ పేరిట చూపెట్టి రూ. 4.37 లక్షలు పరిహారం పొందారు. వెంకటేశ్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క పరిహారం కాజేశారు. – ఉదయగిరి మస్తాన్, రాచగుంటపల్లె, వేముల మండలం


