ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు
కడప సెవెన్‌రోడ్స్ : ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో ఈనెల 14వ తేదీ నుంచి 20 వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు,కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా జాయింట్ కలెక్టర్ అధితి సింగ్ తో కలిసి విడుదలచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇంధన సామర్థ్యం,పరిరక్షణ ప్రాముఖ్యత,విద్యుత్ ఆదా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసంగాలు,ర్యాలీలు, విద్యార్థులలో అవగాహన కల్పించుటకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు, వర్క్ షాప్, వెబినార్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూతాపం, వాతావరణ మార్పులనుఎదుర్కోవడానికి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమము లో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమగ్రంగా న్యూట్రిషనల్ కన్వర్జెన్స్
పైలెట్ ప్రాజెక్టు సర్వే
సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్‌ను ప్రారంభించడం(ఇనాక్ట్స్)్ఙ అనే పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమ సర్వే జిల్లాలో సమగ్రంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో అమలవుతున్న ఇనాక్ట్స్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వే కార్యక్రమంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాజెక్ట్ అసోసియేట్ స్మతితో పాటు సంబందిత జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మహేశ్వర కుమార్, సీఎన్‌ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


