ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్సార్‌సీపీని బలపరిచారు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు/ముద్దనూరు: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ముద్దనూరు నాయకులు తమకు బలం లేకున్నా ముద్దనూరు ఎంపీపీని కై వసం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసినా అవి లెక్కచేయకుండా వైఎస్సార్‌సీపీ పార్టీనే బలపరచారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక పూర్తి అయిన తర్వాత నూతన ఎంపీపీగా ఎంపికై న కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలతతోపాటు ఎంపీటీసీలందరినీ ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయం వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూర్చుతుందని తెలిపారు.
● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కూట మి నాయకులు మెజార్టీలేకపోయినా తమ ఎంపీటీసీలను లాగే ప్రయత్నం చేశారని.. ఎంపీటీసీల ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఆశ చూపారని.. అయితే వైఎస్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఎవరూ పార్టీని వదలలేదన్నారు. దీంతో కూటమి నాయకుల ప్రలోభాలు ఫలించలేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా.. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ముందస్తు ప్రణాళికలతో ఎంపీటీసీలను ప్రత్యేక వాహనంలో ముద్దనూరు ఎంపీడీఓ కార్యా లయానికి తీసుకునివచ్చారు. ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంతో కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది.
పుష్పలత


