రెండో రోజు ‘టెట్’కు 82 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా రెండో రోజు గురువారం నిర్వహించిన టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు 82 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో కడపలోని ఐదు, ప్రొద్దుటూరులోని పరీక్ష కేంద్రంలో నిర్వహించిన టెట్ పరీక్ష కు సంబంధించి 710 మంది విద్యార్థులకు 674 మంది హాజరుకాగా, 36 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో 710 మంది అభ్యర్థులకు 664 మంది హాజరుకాగా, 46 మంది గైర్హాజరయ్యారు. కడపలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని రాష్ర పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆవుల విష్ణువర్థన్‌రెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పోలు సుబ్బారెడ్డి, ఉపేంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన డి. ఉదయ్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రఘునాథ్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గానికి చెందిన సంబటూరు ప్రసాద్‌రెడ్డిలను నియమించారు.
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ విజేతగా కడప జట్టు నిలిచింది. గురువారం కడప, విశాఖపట్టణం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కడప జట్టు విజేతగా నిలవగా, విశాఖపట్టణం జట్టు రన్నర్‌గా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. అనంతరం విన్నర్, రన్నర్ జట్లకు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, కిరణ్, రాకేష్ బాబు, విక్టరీ పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయా లని జేసీ అదితి సింగ్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, ఎన్టీఆర్ భరో సా, దీపం గ్యాస్, రేషన్ సరఫరా, వరి ధాన్యం కొనుగోలు, ప్రజా రవాణా సేవలు, రిజిస్ట్రేషన్ సర్వీసులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం అధి కారులకు జేసీ పలు సూచనలు ఇచ్చారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం దర్శనం కోసం వస్తున్న భక్తుల ఆకలి మూడు పూటల తీర్చడానికి టీటీడీ ప్రారంభించాలనుకున్న నిత్యాన్నదానం కేంద్రానికి కేంద్ర పురావస్తు శాఖ తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం రామాలయ ఆవరణలోని నామాల వనం పక్కనే ఉన్న పచ్చని వనంలో 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు వైశాల్యం గల ప్రమాద రహిత జర్మన్ షెడ్డుతో టీటీడీ సివిల్ విభాగం అధికారులు నిత్యాన్నదానం కేంద్రం తాత్కాలిక ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక్కడ ఒకే సారి 200–250 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. శాశ్వత నిత్యాన్నదాన కేంద్రానికి కేంద్ర పురావస్తూ శాఖ అనుమతలు ఇచ్చేంత వరకు ఈ ప్రాంతంలోనే నిత్యాన్నదానం జరుగుతుందని టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాత్కాలిక నిత్యఅన్నదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వివరించారు.
రెండో రోజు ‘టెట్’కు 82 మంది గైర్హాజరు


