ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి

Dec 10 2025 7:42 AM | Updated on Dec 10 2025 7:42 AM

ముద్ద

ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి

కడప అర్బన్‌ : ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిలు ఆరుగురు ఎంపీటీసీలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆరుగురు వైఎస్సార్‌సీపీ మద్దతు దారులన్నారు. వీరందరిని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అతని అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతియుతంగా తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోవైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు పులి సునీల్‌కుమార్‌, పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, అగటూరు రమేష్‌, చలమారెడ్డి, తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలని విజ్ఞప్తి చేశాం

ముద్దనూరు ఎంపీపీ ఎన్నికను సజావుగా జరిగేలా పోలీసులు సహకరించాలని, ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించిన వారిని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీసుకెళ్లి దొంగ ఓట్లు వేయించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల ప్రాంతంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముద్దనూరులో ఆరుగురు ఎంపీటీసీలు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికే వారిని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని అనుచరులు వ్యక్తిగతంగా వారి ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

– పి రవీంద్రనాథ్‌ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎంపీటీసీలపై దౌర్జన్యాలకు

పాల్పడుతున్నారు

ముద్దనూరు ఎంపీపీ స్థానానికి ఈనెల 11వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అతను అనుచరులు ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలలో ఐదుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. ఎంతమంది ప్రలోభ పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసిన ధైర్యంగా ఎదుర్కొంటాం.

–ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం

సమర్పించిన వైఎస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌ రెడ్డి,

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి1
1/1

ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement