కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజీమానా చేయాలి
కడప కార్పొరేషన్ : విమాన సర్వీసులు సక్రమంగా నడపడంలో విఫలమైన కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌టీయూసీ నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేలకు పైగా విమానాలు రద్దు అయితే కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖామంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తే ఏం జరుగుతుందే ఈ తాజా పరిణామమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఇలాంటి పరిణామాలను ముందే గ్రహించి ప్రధాని నరేంద్రమోడీ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించారని గుర్తు చేశారు.


