ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

Dec 8 2025 7:56 AM | Updated on Dec 8 2025 7:56 AM

ప్రార

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

70 పరుగులు చేసిన సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ బ్యాట్స్‌మన్‌ చరణ్‌ తేజ

5 వికెట్లు తీసిన నార్త్‌జోన్‌ విన్నర్స్‌

బౌలర్‌ చాణిక్య సాయి

3 వికెట్లు నార్త్‌జోన్‌ విన్నర్స్‌ బౌలర్‌ తీసిన షణ్ముఖ గణేష్‌

3 వికెట్లు తీసిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ బౌలర్‌ లోకేష్‌

65 పరుగులు చేసిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ బ్యాట్స్‌మన్‌ ప్రణవ్‌ గోవర్దన్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–14 ఐదవ రౌండ్‌ జోనల్‌ మ్యాచ్‌లు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌– రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ 90 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఆ జట్టులోని చరణ్‌ తేజ్‌ 70 పరుగులు, యాసిన్‌ సిద్దిఖ్‌ 53 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టులోని చరణ్‌ 3 వికెట్లు, నందన్‌ కృష్ణ సాయి, హితేష్‌, సంతోష్‌, సాత్విక్‌, రతన్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు 5 ఓవర్లకు 12 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌–నార్త్‌ జోన్‌ విన్నర్స్‌ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ 67 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ఏవీ చరణ్‌ 53 పరుగులు, కుశల్‌ 27 పరుగులు చేశారు. నార్త్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టులోని చాణిక్య సాయి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్‌ చేసి 5, షణ్ము గణేష్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు 23 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టులోని లోకేష్‌ రెడ్డి 3 వికెట్లు, యూనైస్‌ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ విన్నర్స్‌–రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టు 90 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని లిఖిల్‌ ఇరగంరెడ్డి 96 పరుగులు, ప్రణవ్‌ గోవర్దన్‌ 65 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టులోని తాహీర్‌ 2, కెస్‌కె సమీర్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టు 10 ఓవర్లకు 1 వికెట్‌ కోల్పోయి 39 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు1
1/4

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు2
2/4

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు3
3/4

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు4
4/4

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement