ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
సిద్దవటం : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇన్‌చార్జి రేంజర్ ఓబులేసు తెలిపారు. మండలంలోని గొల్లపల్లి, చలమారెడ్డి కొట్టాలు, ఎస్.రాజంపేట గ్రామాలలో శనివారం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదేశాల మేరకు అటవీ చట్టాలు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే కార్తీక వన మహోత్సవాలలో భాగంగా సిద్దవటం రేంజ్ పరిధి ఎగువపేటలోని శ్రీ నలంద హైస్కూల్‌లో సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య, నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్ వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల ద్వారా మొక్కలు నాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారులు ఆది విశ్వనాథ్, మధు, పెంచల్‌రెడ్డి, ఏబీఓ హైమావతిదేవి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి పనుల తనిఖీ
సుండుపల్లె : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పనులు చేస్తున్న ప్రదేశాలను టెక్నికల్ అసిస్టెంట్ గోవిందు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కొత్త ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు కావాల్సిన వారు ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో ఎటువంటి రుసుం లేకుండా తమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాలిక్‌బాషా, ఫీల్డ్ అసిస్టెంట్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి


