ముగిసిన వేలం పాట
కాశినాయన : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతి క్షేత్రం కాశినాయన ఆశ్రమంలో టెంకాయల వేలం పాటను శనివారం నిర్వహించారు. ఆకుల నారాయణపల్లె గ్రామానికి చెందిన కె.ఈశ్వర్‌రెడ్డి రూ.10లక్షలకు వేలంపాటను దక్కించుకున్నా రు. అలాగే గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చక్రధర్ రూ.3,40,000 లక్షలకు తలనీలాల వేలం పాట పాడారు. వీరు ఏడాది కాలం పాటు టెంకాయలను అమ్ముకోవడం, తలనీలాలను పోగు చేసుకోనేందుకు హక్కు కలిగి ఉంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
డీసీఎంఎస్‌ను అభివృద్ధి చేద్దాం
– డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ
కడప అగ్రికల్చర్ : డిస్ట్రిక్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని(డీసీఎంఎస్) అభివృద్ధి పథంలో నడిపించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం డీసీఎంఎస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీఎంఎస్‌ల ద్వారా వ్యాపారాలను విస్తరింప చేయా లని సూచించారు. జిల్లాలో ఇప్పటికే గోపవరం, చక్రాయపేట, చాపాడు, దువ్వూరు, బిమఠం ప్రాంతాల్లో డీసీఎంఎస్‌ల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. వ్యాపార విస్తరణకు సరైన అంచనాలతో ముందుకు సాగాలన్నారు. తొలుత సహకార పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌సిఓ గోపీకృష్ణ, మార్క్‌ఫెడ్ డీఎం పరిమళజ్యోతి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఖాదర్‌వల్లి, సహకార, డీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
రామయ్య సేవలో
సాఫ్ట్‌బాల్ కోచ్
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని శనివారం నేషనల్ సాఫ్ట్ బాల్ కోచ్ టెక్నికల్ రెఫరీ బద్రినారాయణ దర్శించుకున్నారు. ఆలయ లాంఛనాలతో ఆయనకు స్వాగతం పలికారు. గర్భాలయంలోని మూల విరాట్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగమండపంలో ఆయనను అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈయన వెంట తూర్పు గోదావరి సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు సునీల్, ఉమ్మడి కడప జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, గుంటూరు కోచ్ రవి ఉన్నారు.
శాస్త్రోక్తంగా
స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా మూల విరాట్‌లకు పంచామృతాభిషేకం జరిపార. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, నూతన పట్టువస్త్రాలలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
రాయచోటి జగదాంబసెంటర్ : కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఈ నెల 18వ తేదీన భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) కళాశాలలో స్టెప్ ఆధ్వర్యంలో నిర్వహించన్నారు. ఈ విషయాన్ని ముఖ్య కార్యనిర్వహణాధికారి జోయెల్ విజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలోల భాగంగా పలు అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు https://tinyurl.com/dyfanmy2025 వెబ్‌సైట్ లింక్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఒక పోటీలో మాత్రమే పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9849497045 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ముగిసిన వేలం పాట
ముగిసిన వేలం పాట


