విద్యార్థుల స్థాయికి అనుగుణంగా...
గ్రామీణ ప్రాంత విద్యార్థుల స్ధాయిని దృష్టిలో ఉంచుకొని ప్రాఽథమిక స్థాయి పరీక్షాపత్రాలను రూపొందించాలి. ప్రశ్నపత్రాల స్థ్ధాయి కఠినంగా ఉంది. ప్రాథమిక స్థాయి పరీక్షాపత్రాలలోని పేజీల సంఖ్యను తగ్గించాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించడం చాలా కష్టతరంగా ఉంటుంది.
– ఆదిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి,
ఏపీటీఎఫ్, రాష్టఉపాధ్యక్షుడు
ప్రథమ్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ప్రస్తుత పరీక్షా విధానం పూర్తి అశాసీ్త్రయంగా ఉంది. సిలబస్‌లోని కంటెంట్‌కు ఉపాధ్యాయులు బోధించే అంశాలకు సంబంధం లేని విధంగా ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. దీని వల్ల విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఆందోళన ఏర్పడుతుంది. తాము చదువుకున్న అంశాలు కాకుండా ప్రశ్న పత్రం భిన్నంగా ఉండటం వల్ల వారు పరీక్షలు అంటే నమ్మ కం కోల్పోతారు. – కూశెట్టి పాలకొండయ్య,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా...


