ముగ్గురాయి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
వేంపల్లె: వేంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామం వద్ద అక్రమంగా ముగ్గురాయిని తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు కడప విజిలెన్‌న్స్ మైనింగ్ ఏడీ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం ఎలాంటి రాయల్టీ బిల్లులు లేకుండా ముగ్గురాయిని టిప్పర్‌తో తరలిస్తుండగా పట్టుకొని వేంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏడీ సుబ్రమణ్యం మాట్లాడుతూ అక్రమంగా ముగ్గురాయిని తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వేంపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు బక్కన్నగారిపల్లె నుంచి ముగ్గురాయి తరలిస్తున్నాడనే సమాచారంతో దాడి నిర్వహించి క్రేన్‌లు, పరికరాలు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఆర్డీఓ చిన్నయ్య, తహసీల్దార్ హరినాథ్‌రెడ్డి, వేంపల్లె ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ ఈ దాడిలో పాల్గొన్నారు.


