విద్యుత్ శాఖలో పదోన్నతులు
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్‌పీడీసీఎల్)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కడపలో జేఏఓగా ఉన్న వై. శ్రీనివాసులుకు ఏఏఓగా పదోన్నతి కల్పించి ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. అట్లూరు ఏఈగా పనిచేస్తున్న ఎద్దుల విజయ్ కుమార్‌కు డీఈఈగా పదోన్నతి కల్పించి కడపలోని డిస్ట్రిక్ట్ స్టోర్స్‌కు బదిలీ చేశారు. కమర్షియల్ విభాగంలో ఏఈ ఎస్.అరుణకు డీఈఈగా పదోన్నతి కల్పించి కడపలోని హెచ్‌టీ అండ్ సీటీ మీటర్స్–2కు బదిలీ చేశారు. యర్రగుంట్ల ఏఈఈ వి. ప్రియదర్శన్‌రెడ్డికి డీఈఈగా పదోన్నతి కల్పించి కోడూరుకు బదిలీ చేశారు. ప్రొద్దుటూరు రూరల్ ఏఈగా ఉన్న కె. నరసింహారెడ్డికి డీఈగా పదోన్నతి కల్పించి కడపలోని టీఆర్‌ఈ అండ్ ప్రొటెక్షన్–2కు బదిలీ చేశారు.అన్నమయ్య జిల్లాలో ఏఈ(కన్‌స్ట్రక్షన్‌గా ఉన్న సి. హరిక్రిష్ణకు డీఈగా పదోన్నతి కల్పించి రాయచోటిలోని ఎల్‌టీ మీటర్స్ అండ్ ఎస్‌పీఎంగా బదిలీ చేశారు. ఒంటిమిట్ట ఆపరేషన్ ఏఈ ఎస్. ఉదయ్ కుమార్‌కు డీఈగా పదోన్నతి కల్పించి నంద్యాల టీఆర్‌ఈ అండ్ ప్రొటెక్షన్–2 కు బదిలీ చేశారు.
విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్‌పీడీసీఎల్)డిస్ట్రిక్ట్ స్టోర్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎద్దుల విజయ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏఈగా పనిచేస్తున్న ఆయనకు డీఈఈగా పదోన్నతి కల్పించారు. నూతన డీఈఈ విజయ్ కుమార్‌ను ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ యాకోబు, డివిజనల్ ప్రెసిడెంట్ బాబు, సర్కిల్ డివిజనల్‌సెక్రటరీ జ్యోతి రవి కుమార్, డివిజనల్ సెక్రటరీ దొరబాబు, హరిప్రసాద్ ఆయన్ను సన్మానించారు.


