హత్య కేసులో.. | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో..

Nov 16 2025 7:38 AM | Updated on Nov 16 2025 7:38 AM

హత్య కేసులో..

హత్య కేసులో..

పులివెందుల రూరల్‌ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన గొర్ల వంశీకృష్ణహత్య కేసులో నిందితుడు పప్పూరు రాఘవేంద్రను అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్‌ ఎస్‌ఐ సీతారామిరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని స్థానిక అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ అనే వ్యక్తి రాఘవేంద్ర భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో శుక్రవారం సాయంత్రం చిన్న రంగాపురం గ్రామం వద్ద అతను కత్తితో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో వంశీకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడని తెలిపారు. ఈ హత్యకు అనుమానమే ముఖ్య కారణమనని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ సుభాన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లారెడ్డి, నూర్‌ బాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement