17 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 17 నుంచి అండర్–19 బేస్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కడప ఆర్గనైజింగ్‌సెక్రటరీ చంద్రమోహన్ రాజు తెలిపారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు డిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీలోని పలు విభాగాల్లో నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వైద్య విభాగం జనరల్ సెక్రటరీగా అంకిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి (కడప), రాష్ట్ర వైద్య విభాగం సెక్రటరీగా ఎస్.కల్యాణ్ చక్రవర్తి (బద్వేలు) నియమితులయ్యారు. అలాగే జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీగా చిలేకాంపల్లె ద్వారకనాథరెడ్డి, జిల్లా ప్రచార విభాగం జనరల్ సెక్రటరీగా లింగారెడ్డి వీరప్రతాప్‌రెడ్డిని (కమలాపురం) నియమించారు.
కడప ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నియోజకవర్గ స్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకరణాలను ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 3 నుంచి 18 సంవత్సరాల వయసుగల ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సదరం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతోపాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని ఆయా మండలాల పరిధిలోని సహిత విద్య ఉపాధ్యాయుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలన్నారు. వాటిని తీసుకుని నియోజక వర్గస్థాయి వైద్య శిబిరానికి హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీ బద్వేలు, 19వ తేదీ కడప, 20వ తేదీ పులివెందుల, 21వ తేదీ కమలాపురం, 22వ తేదీ జమ్మలమడుగు, 24న ప్రొద్టుటూరు, 25వ తేదీ మైదుకూరులో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారని వివరించారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: పిల్లలు లేని వారు పిల్లలను పొందేందుకు దత్తత కార్యక్రమం ఒక వరం లాంటిదని శిశు గృహ మేనేజర్ కుమారి తెలిపారు. శుక్రవారం కడప నగర శివార్లలోని బీడీ కాలనీలో అంతర్జాతీయ దత్తత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబం ఆధారిత సంరక్షణ, పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృత్వం పొందాలనుకోవడం ప్రతి దంపతుల కోరిక అని, అలాంటి కోరిక దత్తత కార్యక్రమం ద్వారా నెరవేరుతుందన్నారు. నియమ నిబంధనల ప్రకారం చట్ట బద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాబుచాన్, సోషల్ వర్కర్ పద్మిని, సుబ్బరత్నమ్మ, కల్పన, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కడప రూరల్: మధుమేహం ఎవరికై నా వచ్చే అవకాశం ఉందని, మంచి అలవాట్లతో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు షుగర్, బీపీ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతిరోజు తగినంత వ్యాయామం చేయడం ద్వారా షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచవచ్చని తెలిపారు. ఆహార నియమాలు పాటించడం, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ రవిబాబు, డాక్టర్ ప్రవీణ్‌తో పాటు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
17 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు
17 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు


