మెరుగైన విమానయాన సేవలకు కృషి
మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్: కడప ఎయిర్‌పోర్టు ద్వారా మెరుగైన విమానయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎయిర్‌పోర్టు సలహా కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ హోదాలో అవినాష్‌రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాత్రి పూట విమానాలు ఆగేందుకు వీలుగా అటవీ అనుమతులను పొందామన్నారు. రన్‌వే విస్తరణ కోసం జగన్‌మోహన్‌రెడ్డి 77 కోట్ల రూపాయలు కేటాయించడంతో 75 ఎకరాల భూమి అప్పట్లో సేకరించామన్నారు. దీంతో రన్‌వే విస్తరణ పూర్తయి అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే రూ. 260 కోట్లతో చేపట్టిన కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనం కూడా ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో అనేకసార్లు వినతులు సమర్పించిన ఫలితంగా పెద్ద విమానాలు నిలబడేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. హైదరాబాదుకు వెళ్లాలంటే టిక్కెట్లు దొరకడం లేదని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అదనంగా మరో విమానాన్ని ప్రవేశపెట్టాలని ఇండిగో ఎయిర్‌లైన్స్, కేంద్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను ఇప్పటికే కోరామన్నారు. చైన్నె–విజయవాడ మధ్య ప్రతిరోజు విమానాలు నడిచేందుకు భారత ప్రభుత్వాన్ని, ఇండిగో యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టులో సలహాల పెట్టె ఏర్పాటు చేసి తప్పనిసరిగా నిర్వహణ చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులకు ఆయన సూచించారు.
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ విదేశీ ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నారు కనుక బెంగళూరుకు సైతం ఒక విమాన సర్వీసు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీఎస్‌పీఎస్‌లో భాగంగా కొరత ఉన్న భద్రతా సిబ్బందిని కూడా పూరించేందుకు సహకారం అందిస్తామన్నారు. ఎయిర్‌పోర్టులో భద్రతా వాహనాల ఏర్పాటు కోసం రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుశాఖల సమన్వయ నిర్ణయంతో ముందుకు సాగుతారన్నారు.
● ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు పరిధిలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపడతామన్నారు. ఎయిర్‌పోర్టు ఎదురుగా, నేషనల్ హైవే మీదుగా వాహనాల వేగాన్ని అరికట్టే చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజి త్‌కుమార్ పొదార్, డీజీఎంలు రాజేశ్వర్, తిరుమల మురుగన్, ఆపరేషన్ ఇన్‌చార్జి దామోదర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జగన్ హయాంలోనే అభివృద్ధి పనులు
ఆరు నెలల్లో అందుబాటులోకి కొత్త డొమెస్టిక్ టెర్మినల్
చైన్నె–విజయవాడ మధ్య రోజూ విమానాలకు వినతి
ఎయిర్‌పోర్టులోసలహాల పెట్టె తప్పనిసరి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


