రైతులను ఆదుకోవాలి
కడప కార్పొరేషన్ : మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మినుము, పెసర, బుడ్డశనగ పంటల కోసం విత్తనాలు నాటిన రైతులు 90 శాతం పంటలు నష్టపోయారన్నారు. ఈ దశలో రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్వయంగా వచ్చి కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన్నారు. జిల్లాకు రూ.172 కోట్లు పంటల బీమా వచ్చిందని ప్రకటనలు ఇస్తున్నారని, ఏ మండలంలో ఏ పంటకు ఎంత బీమా మంజూరైందో తెలియడం లేదన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులూ చెప్పడం లేదన్నారు. ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని, ఉల్లి క్వింటా రూ.1200లతో కొనుగోలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. వరికి మద్దతు ధర ఇంత వరకూ ప్రకటించలేదన్నారు. మొక్కజొన్న, పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. 40 రోజులుగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చామంతి పంట వేసిన రైతులు కూడా నష్ట పోయారన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి


