కారు ఢీకొని కాంట్రాక్టర్ దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోరు నారాయణరెడ్డి(75) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ ఆర్. శివనాగిరెడ్డి వివరాల మేరకు బోరు నారాయణరెడ్డి ద్విచక్రవాహనంలో తాడిపత్రి వైపు వెళ్తుండగా కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రం సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర జాతీయ రహదారిలో అతని స్కూటీని వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య బోరు లక్ష్మి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలు
వేముల : మండలంలోని అమ్మయ్యవారిపల్లె గ్రామం వద్ద గురు వారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ఇల్లూరుకు చెందిన ఓ కుటుంబం పెండ్లిమర్రి మండలంలోని పొలతల క్షేత్రానికి వచ్చారు. స్వామి దర్శనం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా.. అమ్మయ్యగారిపల్లె వద్దకు గానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నూర్ మహమ్మద్‌తోపాటు మరో ఇరువురికి గాయాలయ్యాయి.
ఖాజీపేట : జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం భీమరాజు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఖాజీపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన కమలాపురం భీమరాజు తన బైక్‌పై ఖాజీపేటకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పత్తూరు నుంచి సీతానగరం వెళ్లే మార్గమధ్యంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ లేక పోవడంతో వాహనాన్ని గుర్తించలేకపోయారు. సమాచారం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని కడప రిమ్స్‌కు తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ వంశీధర్ కేసు నమోదు చేశారు.
నేడు జిల్లా స్థాయి పోటీలు
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తించేందుకు వృత్తి విద్యలో చేరిన విద్యార్థులకు జిల్లా స్థాయి నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు తెలిపారు. పాఠశాల స్థాయిలో వివిధ ట్రేడ్లు (ఎలక్ట్రానిక్స్, ప్లంబింగ్, కార్పెంటర్, టైలరింగ్, కంప్యూటర్ అప్లికేషన్, వంట, హస్తకళలు) వారిగా 3వ తేదీ నుంచి పోటీలను నిర్వహించి పాఠశాల స్థాయిలో ఒక్కో ట్రేడ్ నుంచి రెండు గ్రూపులను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలను 7వ తేదీ శుక్రవారం కడపలోని నిర్మల ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు.
కారు ఢీకొని కాంట్రాక్టర్ దుర్మరణం
కారు ఢీకొని కాంట్రాక్టర్ దుర్మరణం


