ఆసక్తికరంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయపల్లెలో అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. అవధూత కొండయ్య స్వామి ప్రారంభించిన ఈ పోటీల్లో ఐదు జతల వృషభరాజములు పాల్గొన్నాయి. ఇందులో హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి, జూనియర్ గాండీవ వీర నరసింహారెడ్డికి చెందిన వృషభరాజములు రాతి దూలాన్ని 2,455 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచి, రూ.3లక్షల బహుమతిని గెలుచుకున్నాయి. వైఎస్సార్ జిల్లా చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి, తోట తిరుపాల్‌రెడ్డి, మేడిమాకులపల్లెకు చెందిన దుబ్బన్న, చెన్న కేశవరెడ్డిల సంయుక్త వృషభరాజములు 2,418 అడుగులు లాగి రెండో స్థానంలో నిలిచి రూ.2లక్షలు బహుమతిని గెలుచుకున్నాయి.


