జాతీయ రెజ్లింగ్ పోటీలకు మైదుకూరు విద్యార్థి ఎంపిక
మైదుకూరు : రెజ్లింగ్ అండర్–14 విభాగం జాతీయ స్థాయి పోటీలకు మైదుకూరు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి పాశం నవీన్ ఎంపికయ్యాడు. గుంటూరులో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో నవీన్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు జిల్లా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు మూడే రామ్ నాయక్ ఫాతిమా తెలిపారు. త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో నవీన్ పాల్గొంటాడని వారు పేర్కొన్నారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి గత ఏడాది రాష్ట్రస్థాయి అండర్–14 ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు విద్యార్థి నవీన్ ఎంపికకావడం పట్ల మండల విద్యాశాఖాధికారి పద్మలత, పాఠశాల హెడ్మాస్టర్ ఇలియాస్ అహ్మద్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


