9న విద్యారణ్య భారతీ స్వామి ప్రొద్దుటూరుకు రాక
ప్రొద్దుటూరు కల్చరల్ : హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఈనెల 9న ఆదివారం స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయానికి రానున్నట్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీనగరేశ్వర స్వరూప స్ఫటిక లింగానికి పూజలు చేస్తారన్నారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఉద్యానవనంలో శ్రీపార్వతీదేవి సమేత శ్రీనగరేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 102 మంది ఆర్యవైశ్య సుహాసినులతో పార్వతీమాతకు కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు శివశంకర్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్ : కమలాపురం నియోజకవర్గంలోని గంగనపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బుగ్గేటి శివశంకర్‌రెడ్డి చైన్నెలో నిర్వహించిన 23వ ఆసియా మాస్టర్ అఽథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న 23వ ఆసియా మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో హైజంప్, త్రిపుల్ జంప్ పోటీలలో పాల్గొన్నారు. ఈ మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో 22 దేశాల నుంచి దాదాపు 2046 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు.


