విద్యారంగాన్ని నీరుగారుస్తున్న మంత్రి లోకేష్
మదనపల్లె సిటీ : రాష్ట్రంలో విద్యారంగాన్ని నీరుగారుస్తూ విద్యాశాఖమంత్రి నారా లోకేష్ విదేశాలకే పరిమితమయ్యారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఆరోపించారు. ఎన్నికల సమయంలో పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏఐఎస్‌ఎఫ్ చేపట్టిన బస్సుయాత్ర 16వ రోజు గురువారం మదనపల్లెకు చేరుకుంది. స్థానిక బెంగళూరు రోడ్డులోని జీఆర్టీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల సమయంలో విద్యార్థుఽలకు మంత్రి లోకేష్ అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు. అధికారంలోక వస్తే నెల రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా హామీగానే మిగిలిపోయిందన్నారు. ఏఐఎస్‌ఎ్‌ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్‌జీ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి మస్తాన్, నాగభూషణం, రాష్ట్ర గర్‌ల్స్ కన్వీనర్ భవిత, జిల్లా కార్యదర్శి మాధవ్, ప్రవీణ్, అభి, కృష్ణప్ప, మురళి, కమలాకర్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


