● శనగ రైతులు కుదేలు
కడప అగ్రికల్చర్: వర్షాలు రైతులను కలవరపరుస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవక పంట సాగు చేయడంలో రైతులు అవస్థలు పడ్డారు. అంతోఇంతో సాగు చేసిన పంటలు సైతం చేతికందే సమయంలో వర్షా లకు దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు కుదేల య్యారు. తాజాగా రబీ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పడుతూనే ఉండడంతో రబీ సాగు ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ సాగు చేసిన పంటలు కాస్తా వర్షార్పణం అయ్యాయి. వేలాది రూ పాయల పెట్టుబడులు కాస్తా నీళ్ల పాలయ్యాయి.
● ఈ ఏడాది రబీ సీజన్ డీలా పడింది. సీజన్ మొదలయిందో లేదో వానలు జడిపట్టాయి. పొలాలు నెమ్ము ఆరక రబీ సాగు ముందుకు సాగడంలేదని రైతులు వాపోతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. జిల్లాలో 36 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్ సాధారణసాగు 1,39,796 హెక్టా ర్లు కాగా ఇప్పటివరకు జిల్లాలో కేవలం 6616.38 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. ఇంకా జిల్లావ్యాప్తంగా 1,33,179.62 హెక్టార్లు బీడు భూ మలుగానే ఉన్నాయి. వరుస వానలతో 4.73 శా తంలోపే పంటసాగవడం ఆందోళన పరుస్తోంది.
పెట్టుబడులు నీళ్లపాలు
ఇపట్పివరకు ఆయా పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, సేద్యాలు కలుపు నివారణ తదితరల పెట్టుబడుల రూపంలో ఎకరాలకు రూ.10 నుంచి రూ.15 వేల దాకా వెచ్చించారు. దీనికితోడు పైర్లు మొలక దశ నుంచే వర్షాలు వీడకపోవడంతో సాగు చేసిన పంటలు నీటికి మొలకెత్తకుండా దెబ్బతిన్నా యి. రోజుల తరబడి పైరులో నీరు నిలువ ఉండటంతో నెమ్ము ఎక్కువై మొక్కలు చనిపోయాయని పెట్టుబడులన్నీ నేలపాలవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు వరి, కంది, మొక్కజొన్న, శనగ, పత్తి, వేరుశనగ, మినుము పంటలు దాదాపు 10 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలకు లక్షల్లో నష్టం వాటిల్లింది.
పొలాలన్నీ బీళ్లు..
భారీ వర్షాలతో చాలా వరకు పొలాల్లో గడ్డి, ఇతర కలుపు, పిచ్చి మొక్కలు పెరిగి బీళ్లను తలపిస్తున్నాయి. పది రోజుల నుంచి వరుస వర్షాలతో నేటికి చాలా పొలాల్లో వర్షపు నీరంతా నిలిచి ఉంది. పొలాల్లో తేమశాతం అధికంగా ఉండటంతో రైతులు తమ వ్యవసాయ పనులను చేసుకునేందుకు పొలాల్లో దిగలేని పరిస్థితి నెలకొంది. ఇక పప్పుశనిగ, జొన్న,మొక్కజొన్న, కంది, మినుము, వేరుసెనగ పంటల సాగు కు కేవలం పది రోజులు మాత్రమే గడువుంది. పొలా ల్లో వర్షపు నీరు నిల్వ చేరి అధిక విస్తీర్ణం పంటలు సాగుకు ఆస్కారం లేకుండా పోయింది. వచ్చే పది రోజులు వర్షాలు కురవకపోతే కనీసం 50 వేల హెక్టార్లలో విత్తనాలు పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
సీజన్ ప్రారంభమై నెల దాటినా సాగు అంతంతే
ఇప్పటి వరకు 6616.38 హెక్టార్లలో పంటల సాగు
జిల్లావ్యాప్తంగా బీడుగా దర్శనమిస్తున్నభూములు
భారీ వర్షాలకు పంటలు నీటి మునిగినష్టపోయిన రైతులు
జిల్లాలో ఏటా రబీ సీజన్‌లో విస్తారంగా సాగయ్యే శన గ ఈ ఏడాది రైతులకు సరిగా కలిసి రాలేదు. జిల్లాలో మైలవరం, రాజుపాలెం, పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్‌పల్లి తదితర మండలాల్లో శనగ సాగు ఎక్కువ చేస్తారు. రబీ సీజన్‌లో శనగ సాధారణసాగు 79613 హెక్టార్లకు కావాల్సి ఉండగా అదును ప్రారంభమై నెల రొజులు దాటిన ఇప్పటివరకు 308 హెక్టార్లలో మాత్రమే శనగపంట సాగైంది. ఈ ఏడాది శనగ సాగు బాగా ఉంటుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అరకొరగా విత్తనాలు సరఫరా చేయగా చాలా మంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అధిక శనగ విత్తనాలను కొనుగోలు చేయాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● శనగ రైతులు కుదేలు


