వైభవం..ఉరుసు ఉత్సవం
కడప సెవెన్‌రోడ్స్: ప్రముఖ సూఫీ క్షేత్రమైన కడప అమీన్ పీర్ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజు గురువారం ఉరుసు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫు ల్లా హుసేనీ సాహెబ్ దర్గాలో గురువుల మజార్లపై గంధం సమర్పించారు. కార్యక్రమాలలో భాగంగా తొలు త దర్గా ముషాయిరా హాలులో ఇదారే అమీనియా చిష్తియా వార్షిక నివేదిక సమర్పించారు. రాత్రి ఆసారే షరీఫ్‌లో భాగంగా దర్గాలోని గురువుల స్మారక వస్తువుల దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉరుసు సందర్భంగా విశేష ప్రార్థనలు నిర్వహించి భక్తులందరికీ ఫాతెహా ప్రసాదాన్ని పంచిపెట్టారు. కడప నగరం పెద్ద బజారుకు చెందిన వస్త్ర వ్యాపారులు పూల చాందినితోపాటు వారి పక్షాన గంధాన్ని ఊరేగింపుగా బ్యాండ్ మేళాల మధ్యన దర్గాకు చేర్చి గురువుల మజార్ల వద్ద చదివింపులు చేశారు. అలాగే మండీబజారు నుంచి చౌదరి ఖలీఫాలు చాందిని, గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు చేరుకుని చదివింపులు సమర్పించారు. అనంతరం ప్రముఖ గాయకులు తమ ఖవ్వాలీ గానంతో భక్తులను ఉర్రూతలూగించారు.
ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పణ
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖమంత్రి ఫరూఖ్ కుమారుడు ఫైరోజ్,ఇతర అధికారులు ప్రభుత్వం తరుపున చాదర్ సమర్పించారు. దర్గా ప్రతినిధులు అతిథులకు సంప్రదాయంగా పేటా చుట్టి, కండువా అందజేసి, గురువుల మజార్‌ను దర్శింపజేసి ప్రార్ధనలు చేయించారు.
రవీంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితోపాటు ఇతర నాయకులు దర్గాను దర్శించుకున్నారు. వారికి దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు.
మెరిసిన దర్గా ప్రాంగణం
ఉరుసు ఉత్సవాలలో భాగంగా సాయంత్రం 6 నుంచి దర్గా ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చిన భక్తులతోపాటు బయటి ప్రాంతాల నుంచి భక్తుల సందడి కనిపించింది.
వైభవం..ఉరుసు ఉత్సవం
వైభవం..ఉరుసు ఉత్సవం


