కౌలుకు పొలం తీసుకుని...
నేను రాజుపాలెం మండలం కూలూరు గ్రామంలో 2.5 ఎకరాల్లో భూమి ని కౌలుకు తీసుకుని మినుము పంటను సాగు చేశారు. బాగా పూత పిందె దశలో మోంథా తుఫాన్‌తో వచ్చిన వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు అయింది. చివరకు కౌలును కూడా చేతినుంచి కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్లీ వేరే పంటనేమైనా వేద్దామంటే భూమిలో నెమ్ము ఆరడం లేదు. అది ఆరేలోపు సీజన్ ముగుస్తుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– నారా తిరుపాల్,
కూలూరు గ్రామం, రాజుపాలెం మండలం
ఎనిమిది ఎకరాల్లో
ఎరువులను విత్తాను
శనగపంట సాగు కోసం రూ. 25 వేలు పెట్టి ఎనిమిది ఎకరాల్లో ఎరువులను విత్తాను. కానీ వరుసగా వస్తున్న వర్షాలకు ఆ ఎరువులన్నీ కొట్టుకుని పోయి ఉంటాయి. వరుస వానలతో శనగపంటను విత్తుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో మళ్లీ కలుపంతా పడింది. మళ్లీ సేద్యాలకు ఇబ్బడి ఖర్చులవుతాయి.
– ఎద్దుల గోపాల్, పెద్దపసువుల గ్రామం
సబ్సిడీ విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి
మోంథా తుఫాన్ కారణంగా జిల్లాలో కురిసిన వర్షాలకు ,చాలా మేర పంటల దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. దీంతోపాటు ఆ రైతలందరికీ ఉచితంగా శనగ, మినుము, వెసర వంటి విత్తనాలను ఇవ్వాలి. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
కౌలుకు పొలం తీసుకుని...
కౌలుకు పొలం తీసుకుని...


