అది పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం. నేషనల్ హైవే పక్
పోలీసుస్టేషన్‌కు బంజరు భూమి అప్పగించాలంటా...
సాక్షి ప్రతినిధి, కడప: కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటులో భాగంగా 1.38 ఎకరాలు తాళ్లప్రొద్దుటూరు పోలీసుస్టేషన్‌కు కేటాయించారు. ఆమేరకు తహసీల్దార్ రెఫరెన్స్ నెం.ఏ/785/2021తో డిసెంబర్ 13, 2021న పొజిషన్ సర్టిఫికెట్ కూడా అప్పగించారు. ఇప్పుడా స్థలంపై కూటమి నేతల కన్ను పడింది. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్యే సమీప బంధువులు అధికారికంగా స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నేషనల్ హైవే–67 రోడ్డు పక్కనే స్థలం ఉండడంతో మంచి డిమాండ్ వచ్చింది. సెంటు ధర రూ.3లక్షలు పలుకుతోంది. రూ కోట్ల విలువైన స్థలాన్ని తప్పుడు కారణాలు చూపెట్టి కొల్లగొట్టే ఎత్తుగడలు ఎంచుకున్నారు. అందుకు అధికార యంత్రాంగం దాసోహం దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఒత్తిడి కారణంగా స్థానికంగా పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. ఆ మేరకు సిఫార్సులు చేస్తూ కలెక్టరేట్‌కు ఫైల్ పంపించారు. ఈ విషయమై మంగళవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ పర్యటించారు. పునరావాసం పేరిట సదరు స్థలం కావాలని అర్జీ వేసిన ఎమ్మెల్యే సమీప బంధువు రామాంజులరెడ్డిని గ్రామస్తుల సమక్షంలోనే పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. అప్పుడెందుకు మీరు తీసుకోలేదని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా కేటాయించారంటూ అడ్డగోలుగా అసత్యాలు చెప్పడం అక్కడి ప్రజానీకానికి వింతగా కన్పించింది. వాస్తవానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద టీ–475ద్వారా ఆయన తల్లి వెంకటలక్షుమ్మ, టీ–480 ద్వారా రామాంజులరెడ్డి, కుమారుడు శివానందరెడ్డి మూడు యూనిట్లకుగాను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున రూ.30లక్షలు రామాంజులరెడ్డి పునరావాస పరిహారం అందిపుచ్చుకోవడం గమనార్హం.
అర్హులందరికీ కేటాయింపు...
తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులకు అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 1358 ఇంటి పట్టాలు కేటాయించారు. అందులో గుడి, బడి, ఈద్గా, చర్చి, అంగన్‌వాడీ, గ్రామచావిడి, పంచాయతీ కార్యాలయం, వెటర్నరీ, హెల్త్‌సెంటర్ ఇలా 22 ప్రభుత్వ భవనాలు నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించారు. వాటి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.88.70కోట్లు మంజూరు చేసింది. అందులో పోలీసుస్టేషన్ నిర్మాణానికి రూ.1.40కోట్లు కేటాయించారు. అదే కాలనీలో ఇంకా దాదాపు 200 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా, పోలీసుస్టేషన్‌కు కేటాయించిన 1.38ఎకరాలు కొట్టేసేందుకు కూటమి నేత లు పక్కాగా స్కెచ్ వేశారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్న విషయం తెలుసుకున్న మునుపటి ఎస్పీ అశోక్‌కుమార్ రెవెన్యూ అధికారులకు అభ్యంతరం చెబుతూనే, ఆ స్థలానికి కంచె కూడా వేయించారు. పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని స్థానికంగా ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఒత్తిడి ఫలితం, స్థానికంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి చేతులు బరువెక్కడంతో పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని కూడా అప్పగించేందుకు అధికారులు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది.
తహసీల్దార్ రెఫరెన్స్ నెం.ఏ/785/2021 స్వాధీన పర్చిన 1.38 ఎకరాలు కాకుండా సర్వే నంబర్ 289లో 75సెంట్లు ప్రభుత్వ గయ్యాలి భూమి ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని పోలీసుస్టేషన్‌కు అప్పగించాలని ఎమ్మెల్యే సమీప బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌ఆండ్‌ఆర్ సెంటర్‌లో పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం పట్టాలుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించాలని మంగళవారం కలెక్టర్ దృష్టికి స్థానిక నాయకుడు రామాంజులరెడ్డి తీసుకొచ్చారు. ఈవిషయాన్ని గమనించిన ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు. కాగా, పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని రక్షించుకోవాలనే దిశగా పోలీసుశాఖకే లేకపోవడంతో కూటమి నేతల వ్యూహం మరింత సులువుగా మారిందని పలువురు చెప్పుకొస్తున్నారు. కలెక్టర్ పర్యటనతోనైనా కూటమి నేతల ఆక్రమణ వ్యూహానికి చెక్ పడుతుందో.. లేదా చూడాలి.
తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ స్థలం స్వాహాకు సన్నాహాలు
కోట్లాది విలువైన స్థలం కావడంతోకన్నేసిన ఎమ్మెల్యే అనుచరులు
ఎమ్మెల్యే ఆది దగ్గరుండి కొనసాగిస్తున్న తంతు
క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల అండదండలు
కలెక్టర్ పర్యటనతోబట్టబయలైన వ్యవహారం
అది పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం. నేషనల్ హైవే పక్
అది పోలీసుస్టేషన్‌కు కేటాయించిన స్థలం. నేషనల్ హైవే పక్


