ఉత్సాహంగా మ్యాథ్ బి
కడప ఎడ్యుకేషన్: సాక్షి మ్యాథ్ ‘బి’కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఆసక్తి పెంచేలా చేయడమే మ్యాథ్ బీ లక్ష్యం. చిన్న చిన్న సమస్యలు మొ దలు వారి స్థాయిని అనుసరించి పోటీ నిర్వహించారు. కడప నగరంలోని జీఎంఆర్ స్కూల్, శివశివాని, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, సింహాద్రిపురంలోని గురుజాల నేతాజీ స్కూల్, వేంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్‌లో మంగళవారం ‘సాక్షి’ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో డ్యూక్స్ వ్యాప్తి, ట్రీప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన మ్యాథ్ బి మొదటి రౌండ్ కాంపిటేషన్‌ను నాలుగు కేటగిరీలుగా నిర్వహించారు. ఇందులో కేటగిరీ–1లో 1,2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3,4 తరగతుల విద్యార్థులు, కేటగిరి–3లో 5,6,7 తరగతుల విద్యార్థులు, కేటగిరి–4 లో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న నాగార్జున స్కూల్ విద్యార్థులు
పోటీల్లో పాల్గొన్న జీఎంఆర్ స్కూల్ విద్యార్థులు
ఉత్సాహంగా మ్యాథ్ బి
ఉత్సాహంగా మ్యాథ్ బి
ఉత్సాహంగా మ్యాథ్ బి


