మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉండాలి
మమ్మల్ని సూపర్‌వైజర్‌లుగా నియమించుకుని నెల రోజులపాటు పనిచేయించుకున్న తర్వాత ఉన్నట్లుండి తొలగిస్తే ఎలా? మమ్మల్ని చేర్చుకునే సమయంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలని పరిచయం వున్నవారి ద్వారా చేర్చుకున్నారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకుని రమ్మంటున్నారు. ఈ విధానం ఎంతవరకు న్యాయం? – గోసుల జనార్దన్‌రెడ్డి,
ముండ్లపల్లి, చెన్నూరు మండలం.
కడప రిమ్స్‌లో నూతన శానిటేషన్ కాంట్రాక్ట్ విధానంలో డిగ్రీ అర్హతతో వున్న నన్ను ఎలాంటి సిఫారసు లేఖ లేకపోయినా సూపర్‌వైజర్‌గా చేర్చుకుని నెలరోజుల పాటు పనిచేయించుకున్నారు. వేతనం కూడా ఇవ్వకుండానే వెళ్లిపొమ్మంటున్నారు. నిరుద్యోగులుగా వున్న మాకు న్యాయం చేయాలి. నూతన కాంట్రాక్టర్ మమ్మల్ని సూపర్‌వైజర్‌లుగా విధుల్లోకి తీసుకోవాలి. – బ్రహ్మపుత్రారెడ్డి,
అంగడివీధి, చింతకొమ్మదిన్నె మండలం.
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉండాలి


