రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వాసంతి రెడ్డి
ప్రొద్దుటూరు : పట్టణానికి చెందిన కుందుల వాసంతిరెడ్డిని అఖిల భారత రెడ్డి సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సంఘం అధ్యక్షుడు నారుపల్లె జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా కందుల వాసంతరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత రెడ్డి సంఘం బలోపేతం చేసేందుకు, రెడ్డి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లికి చెందిన పీ.సతీష్ కుమార్ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరిహరప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి మృతికి అనారోగ్య సమస్యలా, వేరే ఇతర కారణాలా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.
గంజాయి నిందితుల పట్టివేత
పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులో ఎస్‌ఐ హరిహరప్రసాద్, సిబ్బంది బుధవారం నాకా బందీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ము గ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ పో లీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడా రు. పోలీసులు సదరు వాహనాన్ని క్షుణంగా తని ఖీ చేయగా సుమారు అరకిలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని మట్లివారిపల్లికి చెందిన రాజోళ్ల హరీష్ (29), మదనపల్లిలోని రామారావ్ కాలనీకి చెందిన ఫరూక్(19)లతోపాటు మరో మైనర్ యువకుడు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టు బడినట్లు తెలుస్తోంది. తహసీల్దారు శ్రీరాములు నాయక్, వీఆర్వో నరేంద్రల సమక్షంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
బొలెరో వాహనం బోల్తా
చిన్నమండెం : మండల కేంద్రంలోని దేవపట్ల క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి వైపు నుంచి కడపకు నారు వేసుకొని వస్తున్న బొలెరో వాహనం దేవపట్ల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకవైపు టైర్ పగిలి అదుపు తప్పింది. ఎవరికీ చిన్నగాయాలు కూడా కాలేదు.
వర్షానికి కూలిన ఇల్లు
జమ్మలమడుగు: మోంథా తుపాను ప్రభావంతో పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో కాచన రమణారెడ్డి, పుల్లమ్మ నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. చౌడుమిద్దె కావడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసింది. ఒక్కసారిగా ఆర్థరాత్రి సమయంలో ఇల్లు కూలింది. అయితే రమణారెడ్డి, పుల్లమ్మ ఇంట్లో కాకుండా సోఫాలు నిద్రించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కూలిన శబ్దం కావడంతో స్థానికులు వచ్చి భార్య, భర్తలను క్షేమంగా బయటికి తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వాసంతి రెడ్డి


