పోలీసుల విధులపై అవగాహన కార్యక్రమం
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీఓపెన్ హౌస్‌శ్రీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్ల, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బాంబు డిస్పోజబుల్ టీం, ఫింగర్ ప్రింట్, పోలీసు కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందాలు, ఆయుధాల విడి భాగాల సమాచారం గురించి ( ఏకే 47 , విల్ పిస్టల్, గ్లో 17, కార్బన్ , ఇన్సాస్ రైఫిల్, గ్యాస్ గన్, గ్రేనేడ్, సి.సి.టి.ఎన్.ఎస్, ఫోరెన్సిక్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ తదితర విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. బాడీ వర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరా, వి. హెచ్. ఎఫ్ సెట్, రోబో డ్రెస్‌ను ప్రదర్శనలో ఉంచారు. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. నగరంలోని వివిధ స్కూళ్లకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు స్వామినాయక్, అప్పలనాయుడు, రామస్వామిరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


