వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పులి సునీల్ కుమార్‌ను ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ నగర అధ్యక్షుడిగా, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి జోన్–5లోని వైఎస్సార్, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ తన నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలకు ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మహబూబ్ బాషా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ మహబూబ్‌బాషా పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.


