● శభాష్.. ఎస్‌ఐ!
కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో వారితో గొడవపడి ఆత్మహత్యా యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ ఎస్‌ఐ సకాలంలో అంబులెన్సు రప్పించి బాధితుడని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. వివరాలలోకి వెళితే..శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కడప ట్రాఫిక్ ఎస్.ఐ జయరాముడు టూ టౌన్ పరిధిలో వెళుతున్న దారిలో జియారా ఫంక్షన్ హాల్ సమీపంలోని ఓ ఇంట్లో పీరుల్లా (29) అనే యువకుడు మద్యం మత్తులో ఇంట్లో వారితో గొడవపడి విష ద్రావణం తాగాడు. ఆపై ఇంట్లోని అద్దాన్ని చేతులతో పగులగొట్టడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో వారు చికిత్స కోసం రోడ్డుపై ఉండడాన్ని గమనించిన ఎస్.ఐ జయరాముడు వెంటనే 108 కు ఫోన్ చేసి అంబులెన్సును రప్పించి అతన్ని రిమ్స్‌కు తరలించారు. సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు సహకరించిన ఎస్.ఐ జయరాముడుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
యువకుడికి సకాలంలో వైద్య సేవలు


