ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతపరచాలి
కడప అగ్రికల్చర్ : క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత పరిచి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. కడపలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయిలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ రైతులకు సీజన్ బట్టి పంటలు ఎంపిక చేసుకుని ఆ పంటలకు సంబంధించిన ఇన్‌పుట్స్ ముందుగా తయారు చేయించి మంచి దిగుబడి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీపీఎం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
చోరీ కేసులో నిందితుల అరెస్టు
తొండూరు : మండలంలోని మల్లేల ఇమాంబీ దర్గాలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం తొండూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఘన మద్దిలేటితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన్నె బీసీ కాలనీకి చెందిన షేక్ హిదయతుల్లా, జమ్మలమడుగు పట్టణానికి చెందిన షేక్ గైబుసావలీ ఈనెల 21వ తేదీన మల్లేల ఇమాంబీ దర్గాలోని హుండీని పగులగొట్టి రూ.30వేల నగదును అపహరించారన్నారు. వారిని శనివారం తొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని భద్రంపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30వేల నగదుతోపాటు హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతపరచాలి


