కార్తీక మాసంలో భక్తుల కోసం విశేష ఏర్పాట్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి 60 బస్సు సర్వీసులు, అన్నమయ్య 56, తిరుపతి 10, చిత్తూరు 20, కర్నూలు 110, నంద్యాల 127, అనంతపురం 66, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 102 బస్సులు నడపనున్నామన్నారు. భక్తులకు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీ సులను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. అలాగే దూర ప్రాంతాల వారికి ఆయా బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు.
కడపజోన్ నుంచి 551 సర్వీసులు
ఆర్టీసీ కడపజోన్ ఈడీ పైడి చంద్రశేఖర్


