జలపాత సోయగం!
ఉరకలై గోదావరి ఉరికెనా మదిలోనికి.. అని సినీకవి అన్నట్లు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కడప సమీపంలోని పాలకొండల్లో జలపాతం ఉరకలెత్తి ప్రవహిస్తోంది. తెల్లటి నురగలు కక్కుతూ హొయలొలుకుతూ శరవేగంగా ప్రవహిస్తున్న జలపాతం అందాలను చూసేందుకు యువతీ, యువకులు ఉత్సాహంగా వస్తున్నారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడంతో జలపాతాన్ని చూసేందుకు విద్యార్థులు, పిల్లలు, పెద్దల సంఖ్య పెరిగింది. ఈ సమయంలోనే వర్షం దంచికొట్టడంతో జలపాతం ఉధృతి కూడా పెరిగింది. జలపాతాన్ని చూసేందుకు వస్తున్న యువత ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ఫొటోలు: సాక్షి ఫోటోగ్రాఫర్.కడప
జలపాత సోయగం!
జలపాత సోయగం!


