జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు గంగనపల్లి విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ 19 స్కూల్ గేమ్స్‌లో భాగంగా పోల్ వాల్ట్ ఈవెంట్ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా పెదవేగి మండలం బాలయోగి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అండర్ 19 స్కూల్ గేమ్స్ పోల్ వాల్ట్ ఈవెంట్ పోటీలలో విద్యార్థులు వి.సుహానా ఫాజియా 2.30 మీటర్ల ఎత్తు దూకి బంగారు పతకాన్ని సాధించింది. అలాగే వి. మోసిన 1.65 మీటర్ల ఎత్తు దూకి వెండి పతకాన్ని సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటారు. వీరు నవంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని భవానిలో జరిగే 69వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. వీరి ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇక్బాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవిశంకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


