మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం స్టేషన్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పరిశీలించారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్‌బాషా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైల్వే డాక్టర్లతో కలిసి పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిది సహజ మరణమేనని, అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా ఫోన్ నెంబర్.9133109537ను సంప్రదించాలన్నారు.


