చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి
చాపాడు : మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మార్తల ఓబులరెడ్డి అనే రైతుకు చెందిన చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు గురువారం రాత్రి ఉన్నట్టుండి ఓబుల్ రెడ్డికి చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. ఈ ఇంట్లో ఉన్న మూడు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక్క గేద విలువ లక్ష పైగా ఉంటుందని మూడు గేదెలు మూడు లక్షలకు పైగా విలువ చేస్తాయని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.


