హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు
చింతకొమ్మదిన్నె : స్థానిక చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులైన ఇందిరానగర్‌కు చెందిన రౌడీషీటర్ చిలకల చాంద్‌బాషా, అతని అనుచరులైన మరో ముగ్గురు ఎర్రవల్లి అబ్దుల్, షేక్ జాకీర్ హుస్సేన్, వలీ అలియాస్ ఖాదర్ హుస్సేన్‌లను గురువారం అరెస్టు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. నిందితులను ఇందిరానగర్ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువచ్చి, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండు నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.


