జాతీయ స్థాయి పోటీలో ఏయూ విద్యార్థుల ప్రతిభ
రాజంపేట : కడప కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎక్స్‌లియర్–2025 జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యార్థుల మీట్‌లో అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు వారిని గురువారం ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏయూ వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి అభినందించారు.
మార్కెటింగ్ గేమ్, హెచ్‌ఆర్ గేమ్, ఫైనాన్స్ గేమ్ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గేమ్‌లో భారత్‌కుమార్, కార్తీక్, కిషోర్‌ల బృందం రెండవ బహుమతిని దక్కించుకుంది. మార్కెటింగ్ గేమ్‌లో వరలక్ష్మీ, వర్ష, కావ్య బృందం మూడవ బహుమతిని సాధించారు. కార్యక్రమంలో పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జె.సమతనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఏయూ విద్యార్థులు ప్రతి చోట ప్రతిభను సాధించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.


