శివాలయాలకు కార్తీక దీపశోభ
కార్తీక దీపాలతో శైవక్షేత్రాలు కళకళలాడాయి. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు
ప్రతిధ్వనించాయి. శివ భక్తులకు ప్రియమైన కార్తీకమాసం బుధవారం ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైందని చాటుతూ ఆలయాల ధ్వజ స్తంభాలపై కార్తీక దీపాన్ని వెలిగించారు. కాగా జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. కడప నగరంలోని శైవ క్షేత్రాల్లో నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లు చేశారు. – ఫొటోగ్రాఫర్, సాక్షి,కడప
శివాలయాలకు కార్తీక దీపశోభ


