2296 హెక్టార్లలో పంట నష్టం
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 15 మండలాల పరిధిలోని 2296 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరిపంట 1489 హెక్టార్లు, కంది 258 హెక్టార్లు, మినుము 329 హెక్టార్లు, వేరుశనగ 134 హెక్టార్లు, పత్తిపంట 81 హెక్టార్లు, మొక్కజొన్న 05 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. సంబంధిత ప్రాథమిక నివేదకలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ వెల్లడించారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి....
వర్షాలకు లోతట్టు పాంతాల్లో ఉన్న పంటలు మునకకు గురి అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.కోత దశలో ఉన్న వరి, మినుము పంటలకు గింజలు మొలకలు వచ్చి పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున సూచనలు పాటించి పంట నష్ట నివారణ చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్


