రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కనుమలోపల్లె రైల్వే స్టేషన్ల మధ్య కడపకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, తమిళనాడుకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నామన్నారు. మృతికి సంబంధించి వివరాలు తెలియరాలేదని, మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు కడప రైల్వే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే సీఐ 94406 27398, ఎస్‌ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు.
వాహనాల బ్యాటరీలను
దొంగిలిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో నిలిచి ఉన్న ట్యాంకర్ బ్యాటరీని దొంగిలిస్తుండగా దొంగను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఎర్రగుంట్ల పట్టణంలోని కాలువ సమీపంలో హనుమనగుత్తి గ్రామ కాస్ వద్ద నిలబడి ఉన్న ట్యాంకర్‌లో నుంచి బ్యాటరీని దొంగిలిస్తుండగా స్థానికులు గమనించారు. స్థానికులు వస్తున్నారని గమనించి ఆ దొంగల్లో ఒకడు కంపచెట్లల్లో పడి పరారయ్యాడు. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడే ఉండి స్థానికులకు దొరికాడు. అతనికి దేహశుద్ధి చేసి ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి కానిస్టేబుల్ శివప్రసాద్ చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. దొంగ పేరు రవీంద్రనాయక్ అని జమ్మలమడుగు మండలం బొమ్మేపల్లి గ్రామానికి చెందిన వాడిగా విచారణలో తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


