ప్రజాస్వామ్యం..అపహాస్యం
ప్రభుత్వ వైఫల్యాలు,అవినీతిని నిలదీస్తున్న ’సాక్షి’పై కూటమి ప్రభుత్వం
కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజ్యాంగం కల్పిచిన పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నాయకులు, పాత్రికేయులు, వివిధ వర్గాల నేతలు మండిపడుతున్నారు.
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి మీడియా జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణం. నెల్లూరులో నకిలీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారని వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల వద్దకు వెళ్లి పోలీసులు హంగామా సృష్టించడం అప్రజాస్వామికం. మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –షేక్ ఉమైర్, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం
ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా?
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపై, రిపోర్టర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. –లక్షుమయ్య, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అప్రజాస్వామికం
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. సాక్షి ఎడిటర్ ధునుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికం. తక్షణమే వీటిని రద్దుచేయాలి.
– ధ్వజారెడ్డి, వైస్‌ఎంపీపీ, రైల్వేకోడూరు
ప్రజాస్వామ్యం..అపహాస్యం
ప్రజాస్వామ్యం..అపహాస్యం
ప్రజాస్వామ్యం..అపహాస్యం


