
4న తలనీలాల వేలం
రాజంపేట టౌన్ : మైనర్లకు బైక్‌లు ఇచ్చేవారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ మనోజ్ రామనాఽథ్ హెగ్డే హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్‌పై డ్రోన్ సహాయంతో మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బైక్‌లు నడిపే మైనర్లను గుర్తించి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే మైనర్‌లు బైక్‌లు నడుపుతున్నారన్నారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదన్నారు. మైనర్లకు బైక్‌లు ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ బి.నాగార్జున, ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బస్సులో బంగారు నగలు చోరీ
ముద్దనూరు : స్థానిక పాత బస్టాండులో ఆర్టీసీ బస్సులో ఎక్కిన మహిళనుంచి నాలుగున్నర తులం బంగారు నగలు చోరీ అయ్యాయి. ఏఎస్‌ఐ రమేష్ సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండలంలోని దేనేపల్లెకు చెందిన లక్ష్మీప్రసన్న అనే మహిళ తన బ్యాగులోని పర్సులో నల్లపూసల దండ, బంగారు హారం పెట్టుకుని పోట్లదుర్తి గ్రామానికి వెళ్లేందుకు తన ఇద్దరు చిన్న పిల్లలతో కలసి పాతబస్టాండులో ప్రొద్దుటూరు బస్సు ఎక్కింది. పాత బస్టాండు నుంచి 4 రోడ్ల కూడలికి వెళ్లిన తర్వాత టికెట్ కోసం పర్సులో వున్న ఆధార్‌కార్డు చూపించడానికి పర్సుకోసం చూడగా బ్యాగులో పర్సులేదని గుర్తించింది. పర్సు దొంగిలించినట్లు తెలుసుకుని వెంటనే బస్సులో నుంచి దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

4న తలనీలాల వేలం