
దేదీప్యం.. దేవీ వైభవం
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ’ కోసం అమ్మవారు అనేక అవతారాలు ధరించారు. వాటిలో కొన్నింటికి విశేష చరిత్ర ఉంది. జగన్మాత రూపాలను దేవీ శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన శుక్రవారం లోకమాత ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాల వెలుగుతో ఆలయాలు శోభాయామానంగా మారాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దేవీ వైభవం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శక్తి స్వరూపిణిని భక్తులు కనులారా దర్శించుకుని పులకించిపోయారు. ‘జగజ్జనని.. లోకపావని’ అంటూ శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
– సాక్షి, నెట్‌వర్క్
ప్రొద్దుటూరు చెన్నకేశవస్వామి ఆలయంలో
మోహిని వనవిహారిణిగా అమ్మవారు
ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో శ్రీదేవి వనవిహారిణి ప్రొద్దుటూరు వాసవీమాతను దర్శించుకుంటున్న భక్తులు
కడప సత్యదేవుని ఆలయంలో మహిళా భక్తుల కోలాటం

దేదీప్యం.. దేవీ వైభవం

దేదీప్యం.. దేవీ వైభవం

దేదీప్యం.. దేవీ వైభవం

దేదీప్యం.. దేవీ వైభవం

దేదీప్యం.. దేవీ వైభవం