
అర్హులకు పదోన్నతులు ఇవ్వాలి
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ఉద్యోగుల పదోన్నతికి సంబంధించి అటెండర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు పదోన్నతులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అడహక్ కమిటి మెంబర్స్ శ్రీనివాసులు, సురేష్, చంద్రశేఖర్‌లతోపాటు సభ్యులు కోరారు. ఈ విషయమై గురువారం ఇంటర్ ఆర్‌జేడీ సురేష్‌బాబుకు తమ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సిబ్బంది పదోన్నతులకు సంబంధించి రోస్టర్ పాయింట్ డిస్‌ప్లే చేసిన తర్వాతే అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు.
ఇన్‌చార్జి మేయర్‌గా
ముంతాజ్ బేగం
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ ఇన్‌చార్జి మేయర్‌గా ముంతాజ్ బేగంను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో కొత్త మేయర్ ఎన్నికయ్యే వరకూ డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
విశ్లేషణాత్మక ఆలోచన ముఖ్యం
– ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా
వేంపల్లె : విద్యార్థులు ఆవిష్కరణాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనతో పాటు ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. గురువారం స్మార్ట్ ఇండియా హ్యకథాన్–2025 లో భాగంగా విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లు ప్రదర్శించారు. దాదాపు 106 టీమ్‌లు ప్రదర్శనలు చేయగా.. ఇందులో 50 ఎంపిక చేశారు. ఎంపికై న టీమ్ సభ్యులను జాతీయ స్థాయికి పంపనున్నారు. అకాడమిక్ డీన్ రమేష్ కై లాస్, ఎస్పిఓసీ కోఆర్డినేటర్ ఉదయశ్రీ పాల్గొన్నారు.
నెలాఖరు వరకు గడువు
కడప సిటీ : మహాత్మాగాందీ ఉపాధి హామీ పథకం కింద పండ్ల మొక్కల పెంపకానికి 100 శాతం సబ్సిడీతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఉందని, ఆసక్తి, అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ బి.ఆదిశేషారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1250 మంది రైతులు 2742 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 1030మంది రైతులకు సంబంధించి 2200 ఎకరాల్లో గుంతలు తీయడం జరిగిందన్నారు. 920 మంది రైతులకుగాను 2058 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. 103 మంది రైతులకుగాను 134 ఎకరాలకు సంబంధించి గుంతలు తీసి మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు వరకు గడువు ఉందని, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ఈ అవకాశం ఉందని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు ప్లాంటేషన్ మేనేజర్ ప్రతాప్ 90008 90293 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మండలాల్లో సంబంధిత ఏపీఓలను కలవొచ్చని తెలిపారు.
ఎరువుల పంపిణీలో
జాగ్రత్తలు తీసుకోవాలి
– జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా త్వరలో రబీ సీజన్ ప్రారంభమవుతుందని ఎరువుల పంపిణీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఏడీలతోపాటు మండల వ్యవసాయ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలను నిర్వహించాలని సూచించారు. అలాగే రబీ సీజన్‌లో విత్తనాల పంపిణీలో ఎక్కుడ అవకతకవలకు జరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యవసాయ కార్యాలయ ఏడీఏ మాధవితోపాటు అన్ని డివిజన్ల ఏడీలు, అన్ని మండలాల ఏఓలు పాల్గొన్నారు.

అర్హులకు పదోన్నతులు ఇవ్వాలి