
నంది వ్రిగహం చోరీ
పెండ్లిమర్రి : మండలంలోని పాతసంగటిపల్లెలో వెలసిన పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు గురువా రం అర్ధరాత్రి చోరీ చేశారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఆలయంలోని వినాయకుడి విగ్ర హం ఎదుట నంది విగ్రహం ఉంది. పురాతన ఆ లయం కావడంతో గుప్తనిధుల కోసం నంది విగ్ర హాన్ని చోరీ చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. రూరల్ సీఐ చల్లనిదొర, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా
చింతకొమ్మదిన్నె : టమాట లోడ్‌తో వెళుతున్న లారీ గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శుక్రవారం బోల్తాపడింది. రాయచోటి వైపు నుంచి కడప వైపునకు వస్తూ ఘాట్ మొదటి మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. లారీ రోడ్డుకు అడ్డుగా పడడంతో కొద్దిసేపు వాహనాలకు అంతరాయం కలిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయచోటి : పట్టణంలోని మాసాపేటలో సుగవాసి సుభద్రమ్మ(60) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో వరండాలో కడ్డీకి చీరతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. సుభద్రమ్మ భర్త మృతిచెందగా ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొద్దిరోజులుగా సుభద్రమ్మ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికుల సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు నెలకొనడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని పోలీసులకు అందిన సమాచారం. సమచారం అందుకున్న రాయచోటి పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి సుభద్రమ్మ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నంది వ్రిగహం చోరీ