
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
కనిష్(5 వికెట్లు)
నిఖిల్‌గౌడ్(153 పరుగులు)
వికాస్(109 పరుగులు)
మహేంద్రారెడ్డి(239)
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లో రెండో రోజున చిత్తూరు, అనంతపురం జట్లు భారీ స్కోర్లు చేశాయి. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో 375 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 103.3 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని నిఖిత్ గౌడ్ అద్భుతంగా బ్యాంటింగ్ చేసి 22 ఫోర్లతో 153, బాలాజీ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని కనిష్ చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి ఐదు, సాయి సూర్యతేజరెడ్డి రెండు, అక్షిత్‌రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 68 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 46, ధనుష్ నాయుడు 46 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బ్రహ్మ సాయి తేజ్‌రెడ్డి మూడు వికెట్లు తీశాడు. కర్నూలు జట్టు ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.
వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో......
వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 364 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 150.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 537 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని మహేంద్రారెడ్డి 30 ఫోర్లుతో అద్భుతంగా చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 239, వికాస్ 109 పరుగులు చేశాడు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ మూడు, నరసింహ రెండు, చెన్నారెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 29 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయరామిరెడ్డి 59 పరుగులు, భరత్‌రెడ్డి 40 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు

చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు

చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు