
నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వండి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీ విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వాలని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ నిత్యానందరాజు అన్నారు. కడప ఎన్జీవో కాలనీలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో కేజీబీవీల ప్రిన్సిపళ్లతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యాపథానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముద్దమందారం పుస్తకాలు పిల్లలందరికీ చేరవేయాలని, వెనుకబడిన పిల్లలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. కాలనిర్ణయ పట్టికను ఖచ్చితంగా అమలుచేయాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డూటీల పట్టిక కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్ అవసరం వరకే వినియోగించాలన్నారు. ప్రతి కేజీబీవీలో జీసీడీఓ ఫోన్ నెంబర్ పిల్లలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రూత్ ఆరోగ్య మేరీ, వీరేంద్ర, శ్రీనివాసులురెడ్డి, అధికారులు పాల్గొన్నారు.